పొట్ట చుట్టూ కొవ్వుకు చెక్ పెట్టే సులువైన మార్గం!
- భోజనం తర్వాత నడక కొవ్వును తగ్గిస్తుందని పరిశోధనల్లో వెల్లడి
- రక్తంలో గ్లూకోజ్ పెరగకుండా అదుపు చేస్తుందని విశ్లేషణ
- జీర్ణక్రియ వేగవంతమై కడుపు ఉబ్బరం తగ్గుతుందని నిపుణుల వివరణ
- చక్కెర స్థాయులు పెరగకుండా నియంత్రణలో ఉంటాయని వెల్లడి
- శరీరంలో రక్తప్రసరణ బాగా మెరుగవుతుందని తేలిన వైనం
శరీరంలో మిగతా భాగాల కంటే పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును కరిగించడం చాలా కష్టం. భారతీయుల్లో అధిక శాతం మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ఇదొకటి. ఇది ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బుల ముప్పును పెంచుతుంది. అయితే ఎలాంటి ఖర్చు, పరికరాలు లేకుండా కేవలం ఒక చిన్న అలవాటు ద్వారా సమస్య నుంచి సులభంగా బయటపడొచ్చని సైన్స్ చెబుతోంది. ప్రతిరోజూ భోజనం చేసిన తర్వాత కేవలం 10 నిమిషాలు నడవడం వల్ల ఈ కొవ్వును నియంత్రించొచ్చని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
గ్లూకోజ్ స్థాయుల నియంత్రణ
భోజనం చేసిన వెంటనే సాధారణ వేగంతో నడవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయులు ఒకేసారి పెరగకుండా అదుపులో ఉంటాయని ‘సైంటిఫిక్ రిపోర్ట్స్’ పరిశోధనలో తేలింది. మనం తిన్న ఆహారం జీర్ణమయ్యాక విడుదలయ్యే గ్లూకోజ్ పొట్ట చుట్టూ కొవ్వుగా మారకుండా చూసుకోవడంలో ఈ నడక కీలక పాత్ర పోషిస్తుంది. నడవడం వల్ల శరీర జీవక్రియలు మెరుగవుతాయి. క్యాలరీలు కరుగుతాయి. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది.
జీర్ణక్రియ మెరుగుపడి గ్యాస్ దూరం
తిన్న వెంటనే నడవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు వేగవంతం అవుతుంది. ఆహారం తిన్న తర్వాత చాలా మందిని వేధించే ప్రధాన సమస్య కడుపు ఉబ్బరం, గ్యాస్. నడక ఒక సులువైన శారీరక శ్రమలా పనిచేసి కడుపులో అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. భోజనం ముగించిన 10 నిమిషాల తర్వాత నడక ప్రారంభించడం వల్ల తిన్న ఆహారం జీర్ణవ్యవస్థలోకి సజావుగా కదులుతుంది. దీనివల్ల పోషకాలు శరీరానికి బాగా వంటబడతాయి.
మెరుగైన గుండె ఆరోగ్యం
భోజనం తర్వాత నడిచే చిన్నపాటి నడక శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుందని ‘బీఎమ్‌సీ కార్డియోవాస్కులర్ డిజార్డర్స్’ జర్నల్ పేర్కొంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా పొట్ట కొవ్వుకు కారణమయ్యే మెటబాలిక్ వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయులు అకస్మాత్తుగా పెరగకుండా నియంత్రించే ఈ అలవాటు ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి ఒక సంజీవనిలా పనిచేస్తుంది.